white-house-responds-over-trump-and-kim-meet

ఉత్తరకొరియాకు అమెరికా కీలక సందేశం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కీలకమైన ప్రకటన చేసింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరువురూ భేటీ అవ్వనున్నారని, చర్చలు జరగనున్నాయనే అంశంపై స్పందించిన వైట్‌హౌస్‌... క్షిపణి, అణ్వస్త్ర ఆయుధాలపై ఉత్తరకొరియా స్పష్టమైన హామీ ఇచ్చి కట్టుబడి ఉంటేనే చర్చలు జరుగుతాయని అమెరికా తేల్చి చెప్పింది. ఉత్తరకొరియా అధినేత కిమ్‌తో చర్చించిన దక్షిణకొరియా ప్రతినిధి.. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు కిమ్ సిద్ధంగా ఉన్నారని, అణ్వస్త్రాలను వీడేందుకు సిద్ధమేనని తెలిపారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన వైట్‌హౌస్ అధికారులు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అణ్వస్త్రాల నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటామని కిమ్ జాంగ్ ఉన్ అంగీకరించిన తర్వాతే చర్చలు జరుగుతాయని సూటిగా తన ఉద్దేశాన్ని వెల్లడించింది. వైట్‌హౌస్ అధికారులు పేర్కొన్న ఈ అంశంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎలా స్పందించనున్నారో వేచిచూడాల్సి ఉంది.