We-will-come-with-NRI-policy-says-KTR

ఎన్నారై పాలసీని ప్రకటిస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 13(ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌, దుబాయి లాంటి దేశాల్లో చనిపోయిన వారిని రప్పించేందుకు, వలసలు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీని తీసుకొస్తుందని ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌ఐ పాలసీపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. గల్ఫ్‌లో చనిపోయిన తెలంగాణ వారికి అక్కడి ప్రభుత్వం పాస్‌పోర్టు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సభ దృష్టికి తెచ్చారు. కాగా, పట్టణాభివృద్ధి సంస్థలకు త్వరలో పాలక మండళ్లను నియమిస్తామని కేటీఆర్‌ శాసనమండలిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఎస్సీలు, ఎస్టీల్లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు టీ-ప్రైడ్‌ పథకంలో ఆర్థిక సాయం చేసేందుకు ఎస్‌సీపీ, టీఎ్‌సపీల నుంచి ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రాకవేత్తలకు 35ు, మహిళా పారిశ్రామికవేత్తలకు 45ు చొప్పున పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు.