We-need-international-monitoring-on-Qatar-say-Gargash

గల్ఫ్ సందిగ్ధతపై తాజాగా స్పందించిన యూఏఈ మంత్రి

దోహ: గల్ఫ్ దేశాల వేదికగా సంక్షోభకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. సౌదీఅరేబియా, యూఏఈ, బహ్రైన్, ఈజిప్ట్ దేశాల కూటమి, ఖతర్ మధ్య నెలకొన్న సందిగ్ధకర వాతావరణం కొనసాగుతూనే ఉంది. సమస్యను పరిష్కరించేందుకు ఫ్రాన్స్ రంగంలోకి దిగిన అనంతరం నాలుగు దేశాల కూటమి తరపున యూఏఈ అంతర్జాతీయ వ్యవహారాల శాఖా మంత్రి అన్వర్ గర్షా మాట్లాడారు. గల్ఫ్‌లో నెలకొన్న ఈ సందిగ్ధతకు పరిష్కారం కావాలని, ఖతర్‌పై అంతర్జాతీయ పర్యవేక్షణ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఖతర్‌పై అన్నీ విధాల ఒత్తిడిని పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ఘాటుగా పేర్కొన్నారు. ఖతర్, అమెరికా మధ్య జరిగిన అవగాహాన ఒప్పందాన్ని ఆయన సమర్ధించారు. ఉగ్రవాద నిరోధానికి ఈ ఒప్పందం సహకరిస్తుందని తాము భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇదిలావుండగా ఉగ్రవాదానికి ఆర్థికంగా సహకరిస్తోందనే కారణంతో సౌదీఅరేబియా, యూఏఈ, బహ్రైన్, ఈజిప్ట్ దేశాల కూటమి ఖతర్‌పై పలు ఆంక్షలు విధించాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితులను చక్కదిద్దెందుకు పలు దేశాలు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. సందిగ్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది.