water-found-in-mars-

అంగారకుడిపై నీటి జాడలు..

వాషింగ్టన్: అంగారక గ్రహంపై మంచు పలకాలు ఉన్నాయని నాసా ప్రకటించింది. ఎక్కడికెళ్లిన మనిషికి నీరు అవసరమని నాసా తెలిపింది. అందుకు తగ్గట్లే అంగారక గ్రహంపై గతంలో సమృద్ధిగా నీరు ఉండేదని నాసా చెబుతోంది. అయితే మారిన పరిస్థితుల కారణంగానే అంగారకుడిపై నీటి నిల్వలు తరిగిపోయాయని నాసా అభిప్రాయపడుతోంది. ఈ ఆధారాలు అంగారకుడిపై నీరు ఉంటుందనే భావనలకు బలం చేకూర్చుతున్నాయని నాసా తెలిపింది. నాసా ఉపగ్రహం పంపిన ఫోటోలను విశ్లేషించిన అరిజోనా యూనివర్సిటీ ప్రొఫెసర్ షేన్ బార్న్ కూడా అంగారకుడిపై నీటినిల్వలు ఉండొచ్చని తెలిపారు.