Watchman-gets-3-months-jail-for-molesting-6-year-old-boy

వాచ్‌మన్ చేసిన పనిది..మూడు నెలల జైలుశిక్ష

దుబాయ్: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన ఓ భారతీయుడు నేరానికి పాల్పడ్డాడు. నేరం రుజువుకావడంతో మూడు నెలల జైలుశిక్షతోపాటు అక్కడి నుంచి భారత్‌కు వెళ్లగొట్టనున్నారు. యూఏఈలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారత్‌కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి దుబాయ్ నగరంలోని సీసీ కెమేరాల పర్యవేక్షణ రూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 6 ఏళ్ల వయసున్న ఓ అరబ్ బాలుడికి మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలుడికి ముద్దులు పెట్టడంతోపాటు అసభ్యకరంగా చేతులు వేశాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమేరాల్లో రికార్డయ్యాయి. బాలుడు తనకు ఎదురైన పరిస్థితి వెల్లడించడంతో పూర్తి విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువుకావడంతో నిందితుడికి మూడు నెలల జైలుశిక్ష విధించారు. శిక్షాకాలం పూర్తైన అనంతరం దేశం నుంచి వెళ్లగొట్టాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.