బోస్టన్, యూఎస్ఏ: ‘టీమ్ ఎయిడ్’ ఆధ్వర్యంలో బోస్టన్లోని గ్రీన్హిల్ పార్క్ వొసెస్టర్లో ‘రెయిన్బో వాలీబాల్ కప్ టోర్నమెంట్’ విజయవంతంగా ముగిసింది. టీమ్ ఎయిడ్‌కు చెందిన మోహన్ నన్నపనేని ప్రారంభించిన ఈ టొర్నమెంట్లో 20 పురుషుల వాలీబాల్ జట్లు, 5 ఉమెన్ తోబ్రాల్ జట్లు పాల్గొన్నాయి. నెరుపుడ టీం మెన్స్ వాలీబాల్ ట్రోపీని మూడవసారి విజయవంతంగా గెలుచుకుంది. డాన్ రీడీ ఫ్యాన్ క్లబ్ రన్నర్‌గా నిలిచింది. వెస్ట్‌ఫోర్డ్ వారియర్స్ సిల్వర్ ట్రోపీని దక్కించుకుంది. త్రోబాల్ విభాగంలో లైటెనింగ్ క్వీన్స్ రెండవసారి ట్రోపీని దక్కించుకుంది. గోల్డెన్ ఈగల్స్ జట్టు వరుసగా రెండవసారి రన్నర్‌గా నిలిచింది. ఈ టోర్నమెంట్‌ను దాదాపు 300 మంది ప్రేక్షకులు ఆస్వాధించారు. ఎన్నారైలతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. టోర్నమెంట్ విజయవంతమవ్వడంలో వాలంటీర్లు చక్కని సహకారం అందించారు. ప్రేక్షకులు, ఆటగాళ్లకు మంచి స్నాక్స్తోపాటు మధ్యహ్న భోజనం ఏర్పాటు చేశారు. మయూరి ఇండియన్ క్యూసిన్ వెస్ట్బొర్, ధరణి రెస్టారెంట్ వెస్ట్బొర్, గోదావరి ఫ్రామింఘమ్, బావర్చీ బిర్యానీ ఫ్రామింఘమ్ మంచి రుచికరమైన భోజనాన్ని అందించాయి. రవి ప్రకాశ్ పౌండేషన్, ఆర్ఎక్స్ అడ్వాన్స్, అడ్వాలెంట్ సిస్టమ్స్, డా. బాబు పిడియాట్రిక్స్ వొర్సెస్టర్స్ స్పాన్సర్లుగా వ్యవహరించారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వాలంటీర్లు, ఇతర సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండి