volcano-has-changed-paths-

అగ్నిపర్వతం బద్ధలవ్వడంతో..

హవాయ్: అగ్నిపర్వతం కిలాలియో బద్ధలవ్వడంతో చుట్టుపక్కల నివసించే ప్రజలను అధికారులు ఇళ్లు ఖాళీ చేయించారు. అయినా ముప్పు నుంచి కొంతమంది తప్పించుకోలేకపోయారని అధికారులు తెలిపారు. దాదాపు 70 మందికి పైగా ప్రజలు లావాతో కూడిన బూడిద ముంచెత్తడంతో వారు మరణించారని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే బద్ధలైన కిలాలియో అగ్నిపర్వతం నుంచి లావా ఓ నదిలా ప్రవాహిస్తూ ఊళ్లను ముంచెత్తిందని అధికారులు చెప్పారు.

అంతేకాదు బూడిద పది కిలోమీటర్ల ఎత్తులో ఎగసిపడిందని అధికారులు చెప్పారు. అయితే ఇటీవల కొన్ని శాటిలైట్స్ తీసిన ఫోటోలను వారు పరిశీలించారు. కిలాలియో అగ్నిపర్వతం నుంచి వెదజల్లుతున్న లావా దారి మార్చుకుందని వారు తెలిపారు. ఇప్పటికీ ముప్పు తొలగిపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు.