Very-Easy-Way-to-Get-The-Passport-

వారం రోజుల్లోపే పాస్‌పోర్టుల జారీ

ఒకప్పుడు పాస్‌ పోర్టు కావాలంటే ఆరు నెలలు పట్టేది..
హన్మకొండ పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సత్వర సేవలు
 
కాళోజీ జంక్షన్‌ (హన్మకొండ): ఒకప్పుడు విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన పాస్‌పోర్టు కావాలంటే ఆరు నెలల కాలం పట్టేది. ఉన్నత చదువుల కోసం ఎవరికో సంపన్నులకు మాత్రమే పాస్‌పోర్టు అవసరమయ్యేది. కాని నేడు కాలం మారింది. పరిస్థితులను బట్టి పాస్‌పోర్టుల అవసరం ఎంతగానో పెరిగింది. నేడు సామాన్యులు సైతం ఉపాధి, ఉద్యోగాలు, ఉన్నత చదువులకోసం అధిక సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తెరిగిన భారత ప్రభుత్వ విదేశీ విధానాల శాఖ ప్రస్తుతం పాస్‌పోర్టుల జారీని సులభతరం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో ప్రాంతీయ పాస్‌ పోర్టు కార్యాలయం పరిధిలో ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ప్రజల అవసరాలను బట్టి పలు జిల్లాల్లో పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అందులో భా గంగా హన్మకొండ హెడ్‌పోస్టాఫీస్‌ ప్రాం గణంలో పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేం ద్రాన్ని ఏర్పాటుచేశారు. 2017 సంవత్సరం మార్చి 29న అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాస్‌పోర్టు సేవా కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు. అప్ప టినుంచి ప్రజలకు పాస్‌ పోర్టులను తీసుకోవడం సులభతరమైంది. ఈ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో రోజుకు సుమారుగా 90మంది పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ప్రాసెస్సింగ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి గా పని చేస్తున్న డాక్టర్‌ ఇ.విష్ణువర్ధన్‌రెడ్డి వరంగల్‌ జిల్లా నివాసి కావడంతో హన్మకొండ పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని అన్ని హంగులతో కూడిన ఆధునాతన కార్యాలయానికి సహకరించినట్లు పలువురు చెబుతున్నారు. ఈ పో స్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రం కార్పొరే ట్‌ ఆఫీ్‌సను తలపించేలా ఉండి అందు లో పనిచేసే నలుగురు సిబ్బంది పాస్‌పోర్టుకోసం వచ్చే దరఖాస్తుదారులకు స త్వర సేవలు అందిస్తున్నారు.

కార్యాలయంలో రిసెఫ్షనిస్టు కౌంటర్‌, దరఖాస్తు స్వీకరణ కౌంటర్‌, ప్రాసెస్సింగ్‌ విభాగం, విచారణ చేసే విభాగాలు ఉన్నాయి. పాస్‌పోర్టు దరఖాస్తును ప్రాసెస్సింగ్‌ చేసిన వెంటనే హైదరాబాద్‌లోని ప్రాంతీ య పాస్‌పోర్టు కార్యాలయం సిబ్బంది స్పందిస్తున్నారు. అనంతరం గ్రాంటింగ్‌ ఆ ఫీసర్‌ పాస్‌పోర్టు జారీకి ఆమోద ముద్ర వేస్తున్నారు. దీంతో వెంటనే వారం రోజుల్లోపు దరఖాస్తు దారుడికి స్పీడ్‌ పోస్టులో పాస్‌పోర్టు చేతికి వస్తోంది.

 
పాస్‌ పోర్టు అందే విధానం ఇలా..
పాస్‌పోర్టు కావాలనుకునే వ్యక్తి ముందుగా ఆన్‌లైన్‌లో పాస్‌పోర్టు వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఆ వ్యక్తి ప్రభుత్వానికి తగు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పెద్దలకు రూ. 15వందలు, మైనర్లకు రూ. 1వేయి దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. పుట్టిన తేదీ, ఆధార్‌కార్డు లేదా ఓటరు ఐడీ, అడ్రస్‌ ప్రూప్‌గా ఒరిజినల్‌ పత్రాలను దరఖాస్తుకు జమచేయాలి. అధికారులు అన్ని విధాలుగా దరఖాస్తును పరిశీలించాక సంబంధిత స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు దరఖాస్తు దారుడికి సంబంధించిన మెసేజ్‌అందుతుం ది. మెసేజ్‌ అందగానే సదరు పోలీసులు దరఖాస్తుదారుడికి ఫోన్‌ చేసి విచారణ కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఫోన్‌ చేస్తారు.
పోలీసులు ఆ వ్యక్తి గురించిన పూర్తి వివరాలు సేకరించి క్లియరెన్స్‌ ఇవ్వగానే పాస్‌పోర్టు సిద్ధమై స్పీడ్‌ పోస్టులో పంపిస్తారు. గతంలో పాస్‌ పోర్టు కోసం ఆరు నెలలు హైదరాబాద్‌ చుట్టూ తిరగాల్సి వచ్చేందని కాని నేడు ఇంత సులభంగా పాస్‌ పోర్టు చేతికందుతోందని దరఖాస్తుదారులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు.