US-to-overtake-Saudi-Arabia-and-Russia-

సౌదీ, రష్యాలను అధిగమించనున్న అమెరికా !

వాషింగ్టన్: ఆయిల్‌ను పెద్దమొత్తంలో ఉత్పత్తి చేసే గల్ఫ్ దేశం సౌదీఅరేబియాతోపాటు రష్యాను అగ్రరాజ్యం అమెరికా  త్వరలోనే అధిగమించనుంది. రోజుకు 8,46,000 బారెళ్ల ఆయిల్ ఉత్పత్తికి అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికాలోని ఆయిల్ ఉత్పత్తిదారుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 2019లో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారుగా అమెరికా అగ్రస్థానంలో నిలువనుంది. 2025 నాటి అమెరికా ఆయిల్ ఉత్పత్తి రోజుకు 8 మిలియన్ల బారెళ్లకు చేరనుందని అమెరికా అధికారులు అంచనావేస్తున్నారు.