:: Welcome to NRI - Article ::

చైనాను దెబ్బకొట్టిన అమెరికా?

వాషింగ్టన్/బీజింగ్: అమెరికా, అమెరికా మిత్రదేశాలను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భయపెట్టడంలో చైనా పాత్ర, మద్ధతు ఉందని అమెరికా నమ్ముతోందా?.. ఉత్తరకొరియాపై ఆంక్షల పేరుతో చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని అమెరికా ప్రయత్నించిందా?.. అనే ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. ఉత్తరకొరియా, అమెరికా మధ్య ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో కొద్ది వారాలుగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య, వ్యాపార లావాదేవీలు తగ్గాయి.  ఉత్తరకొరియాతో చైనా బంధాలను కొనసాగిస్తోందని, మద్ధతిస్తోందని అమెరికా భావించడమే దీనికి కారణమైంది. అంతేకాకుండా తాజాగా ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విధించిన ఆంక్షలు చైనాలోని ప్రధాన బ్యాంకులను దెబ్బతీయనున్నాయి. అంతేకాకుండా ఉత్తరకొరియాతో వాణిజ్యబంధాలను కొనసాగించవద్దని కంపెనీలపై కూడా ఆంక్షలు విధించారు. ఈ ప్రభావం చైనా కంపెనీలు, బ్యాంకులపై అధికంగా పడనుంది. దీంతో ఆర్థికంగా చైనాకు నష్టం జరగనుంది. దీంతో అమెరికాను దెబ్బకుదెబ్బ తీయాలని చైనా భావించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఇదిలావుండగా ఉత్తరకొరియాపై తాజాగా విధించిన ఆంక్షల గురించి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘‘ఆంక్షల వల్ల ఏం జరగబోతుందో ఊహించలేం’’ అన్నారు. ఇదిలావుండగా హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఎడ్ రాయ్‌‌సీ మాట్లాడుతూ.. ఉత్తరకొరియాతో వాణిజ్యం చేస్తున్న పెద్ద బ్యాంకులను అమెరికా టార్గెట్ చేసిందని ఆయన అన్నారు. దీంతో చైనా మరింత కుటిలయత్నాల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చైనా ఏవిధంగా ప్రవర్తించనుందనేది త్వరలోనే తెలుస్తుందని నిపుణులు అంటున్నారు.