US-Congress-Takes-Up-Fate-Of-18-lakhs-Young-Immigrants

అమెరికా కాంగ్రెస్‌లో కీలక అంశం..తేడావస్తే..

వాషింగ్టన్, యూఎస్‌ఏ: సుమారు 18 లక్షలమంది యువత జీవితాలను ప్రభావితం చేయనున్న అత్యంత కీలకమైన ఇమ్మిగ్రేషన్ అంశంపై అమెరికా కాంగ్రెస్‌లో చర్చమొదలైంది. చిన్నప్పుడే తల్లితండ్రులతోపాటు అమెరికా వలస వెళ్లి అక్కడే జీవించాలని కోరుకుంటున్న డ్రీమర్స్‌కు పౌరుసత్వం కల్పించే అతిముఖ్యమైన డ్రీమర్స్ యాక్ట్ అనే అంశంపై సోమవారం చర్చమొదలైంది. అతిముఖ్యమైన అంశంగా భావించిన కాంగ్రెస్ సభ్యులు సుముఖత వ్యక్తం చేయడంతో చర్చ మొదలైంది. 

ప్రత్యర్థి పార్టీ డెమొక్రాట్లు డ్రీమర్‌కు అమెరికా పౌరుసత్వాన్ని కల్పించాల్సిందేనని గట్టిపట్టుపడుతున్నారు. డెమొక్రాట్లకుతోడు కొందరు రిపబ్లికన్లు కూడా మద్ధతు పలుకుతుండడం ఆసక్తికరంగా మారింది. అయితే అధ్యక్షుడు ట్రంప్ తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. డ్రీమర్స్ సంబంధం లేకుండా ఇతర ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులకు అనుమతి, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి నిధుల విషయంలో డెమొక్రాట్లు సహకరిస్తే డ్రీమర్స్ విషయంలో సానుకూలమని ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కీలకమైన ఈ అంశంపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతుండడంతో అనేకమంది డ్రీమర్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.