US-committed-to-irreversible-North-Korea-denuclearisation-says-pompio

అమెరికా కీలక ప్రకటన

వాషింగ్టన్: సింగపూర్‌ వేదికగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల చరిత్రాత్మక భేటి అనంతరం అమెరికా కీలక విషయాన్ని వెల్లడించింది. అణ్వాయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాతే ఉత్తరకొరియాపై ఆంక్షలను ఎత్తివేయనున్నామని స్పష్టం చేసింది. ‘‘ పున: తయారికీ అవకాశం లేని తనిఖీకి అవకాశం ఇస్తూ అణ్వాయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేసిన తర్వాత మాత్రమే ఆంక్షలను ఎత్తివేస్తాం’’ అని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపియో అన్నారు. ఉత్తరకొరియాతో ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉందని, అమెరికా మిలిటరీ దాళాలను కొరియా ద్వీపకల్పం నుంచి ఉపసంహరించుకునేందుకు సిద్ధమని తెలిపారు. సియోల్ నగరంలో దక్షిణకొరియా, జపాన్‌కు చెందిన ఉన్నతాధికారులతో చర్చల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, కిమ్ మధ్య జరిగిన చర్చల్లో అణ్వాయుధాల నిర్వీర్యానికి సంబంధించి నిర్ధిష్టమైన నింబంధనలేవీ ఒప్పందంలో పేర్కొనలేదని వార్తలు వెలువడుతున్న తరుణంలో పొంపియో వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.