US-and-Britain-warn-of-global-cyber-attack

బీ అలెర్ట్.. సైబర్ దాడి జరిగే అవకాశం

లండన్/వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా మరో హానికరమైన సైబర్ దాడి జరిగే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్‌లు సంయుక్తంగా సోమవారం హెచ్చరికలు జారీ చేశాయి. రూటర్లు, నెట్‌వర్కింగ్ వ్యవస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరిగే అవకాశం ఉందని అంచనవేశాయి. రష్యా ప్రభుత్వానికి సంబంధించిన హ్యాకర్లు ఈ దాడికి పాల్పడవచ్చని హెచ్చరించాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, బిజినెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆపరేటర్లు లక్ష్యంగా ఈ దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. బ్రిటన్, అమెరికా సంయుక్తంగా ఈ ప్రకటన చేశాయి. 2015లో ఇలాంటి దాడులు మొదలయ్యాయని, భవిష్యత్తులో కూడా ప్రమాదకరమైన దాడులు జరిగే అవకాశం ఉందని , ప్రపంచ వ్యాప్తంగా అనేక కంప్యూటర్లు, నెట్‌వర్కింగ్ వ్యవస్థలు ధ్వంసమయ్యే అవకాశముందని జాగ్రత్త తీసుకోవాలని సూచించాయి. 2017లో జరిగిన రాన్సమ్‌వేర్ దాడికి రష్యానే కారణమని ఆరోపించిన రెండు నెలల అనంతరం ఈ హెచ్చరిక వెలువడింది.