United-Airlines-engine-rip-off-mid-flight

గాల్లోని విమాన ఇంజిన్ భాగాలు ఊడిపోయాయి..

శాన్‌ఫ్రాన్సిస్కో: గాల్లో ఉన్న విమాన ఇంజిన్ భాగాలు ఊడిపోతే ఎలా ఉంటుంది.? విమానంలోని ప్రయాణికులకు ఈ సంగతి తెలిస్తే పరిస్థితి ఏంటి?.. తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. 

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరం నుంచి హొనొలులుకు యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఏ1175 విమానం బయటదేరింది. విమానం ల్యాండ్ అవ్వడానికి సరిగ్గా 36 ముందు విమానం ఇంజిన్‌లో భాగాలు ఊడిపోవడం మొదలైంది. కొన్ని భాగాలు ఊడిపోయాయి. ఈ విషయం ప్రయాణికులకు తెలియడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాణం భయంతో వణికిపోయారు. విమానంలో ప్రయాణికుల పరిస్థితిని తెలియజేస్తూ విమానంలోని గూగుల్ యూఎక్స్ ఇంజినీర్ ఇరిక్ హడ్డడ్ ఓ వీడియోని ట్వీట్ చేశారు. ఇంజిన్ భాగాలు ఊడిపోతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో విమానాన్ని ల్యాండ్ చేయడం ఫైలెట్లకు కష్టంగా మారింది. కానీ వేరే పద్ధతి ద్వారా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఊహించని పరిణామం ఎదురైందని అధికారులు తెలిపారు. కిందపడిన విమాన ఇంజిన్ భాగాన్ని అధికారులు గుర్తించి సేకరించామని తెలిపారు.