uber-driver-rapes-a-passenger

ఉబర్ డ్రైవర్‌కు 22 ఏళ్ల జైలుశిక్ష

ఫ్లోరిడా, యూఎస్ఏ: ఓ ఉబర్ డ్రైవర్‌ తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. ఓ ప్రయాణికురాలిపై క్యాబ్‌లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్యారీ కిచింగ్స్ అనే 58 ఏళ్ల వ్యక్తి ఫ్లోరిడాలో ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది మే నెలలో ఓ ప్రయాణికురాలిపై అత్యాచారం చేశాడు. తాను పనిచేస్తున్న ప్రదేశం నుంచి తన ఇద్దరు మిత్రులతో బాధిత మహిళ క్యాబ్ ఎక్కింది. మిత్రులు ఇద్దరూ తమ నివాసాల వద్ద దిగిపోవడంతో కారులో ఉన్న ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన బాధిత మహిళకు తుపాకీని చూపించి బెదిరించాడు. కారు డోర్లు లాక్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత మహిళను ఇంటి వద్ద దించి పారిపోయాడు. 

ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై కోర్టు విచారణ ఈ బుధవారం పూర్తైంది. నిందితుడు నేరం చేసినట్లు రుజువవ్వడంతో నిందితుడికి 22 ఏళ్ల జైలుశిక్ష విధిస్తున్నామని న్యాయమూర్తి ప్రకటించారు. జీవితకాల జైలుశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్ వాదించినప్పటికీ 22 ఏళ్ల శిక్ష విధిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. బాధితురాలు న్యూయార్క్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ అని పోలీసులు వెల్లడించారు.