UAE-resident-finds-Dh40,000-on-street

రోడ్డుపై 40 వేల దిర్హమ్స్ దొరకడంతో..

అబుదాబి: ఓ యువకుడికి పోలీసులు ప్రశంసాపత్రంతోపాటు బహుమతి ఇచ్చి సత్కరించారు. ఆ యువకుడి నిజాయితీకి మెచ్చి పోలీసులు ఈ పని చేశారు. ఆసియా దేశాలకు చెందిన ఓ వలసదారుడు 40 వేల దిర్హమ్స్(రూ.7,67,080)  పొగొట్టుకున్నాడు. రోడ్డుపై ఆ నగదు పడి ఉంది. అయితే అటుగా వెళ్తున్న అబుదాబికి చెందిన యువకుడు డబ్బు రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించాడు. డబ్బు ప్యాకెట్‌ రూపంలో మూటగట్టి ఉందని అతడు తెలిపాడు. అంతేకాకుండా ఆ మూటపై పేరు ఇతర వివరాలు కూడా ఉన్నాయన్నాడు. డబ్బు తీసుకుని నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి అప్పగించానని అతడు చెప్పాడు. ఎవరూ గమనించని ప్రదేశంలో పెద్ద మొత్తంలో డబ్బు దొరికినా కూడా అతడు ఆ డబ్బు తీసుకోకుండా తమకు అప్పగించడం నిజంగా అభినందనీయమని పోలీసులు అధికారులు అభిప్రాయపడ్డారు.