:: Welcome to NRI - Article ::

కిమ్‌జాంగ్‌కు షాక్.. దుబాయి సంచలన నిర్ణయం

దుబాయి:ఉత్తర కొరియా ప్రభుత్వానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఊహించని షాకిచ్చింది. ఉత్తర కొరియన్లకు ఇకపై వీసా సర్వీసులు అందించబోమని తేల్చిచెప్పింది. ఉత్తర కొరియాతో సంబంధాల విషయమై దుబాయి ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కొరియాకు తన రాయబారిని రద్దు చేసుకుంది. ఉత్తర కొరియా పౌరులకు వీసాలు, కంపెనీ వీసాలను ఇకపై ఇవ్వబోమని తెలిపింది. ఉత్తర కొరియా చేస్తున్న అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగానే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దుబాయి ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ భద్రతను దృష్టిలో పెట్టకుని తమ వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయాన్ని తాము కూడా అనుసరిస్తున్నట్లు గల్ఫ్ దేశాలయిన కువైట్, ఖతర్ తేల్చిచెప్పాయి. ఇప్పటికే యూఏఈలో దాదాపు 1300 మంది ఉత్తర కొరియన్లు జీవనోపాధి పొందుతున్నారని దక్షిణ కొరియా ఓ ప్రకటనలో తెలిపింది.