UAE-denies-it-violated-Qatari-airspace

‘మేము అలా చేయలేదు’

అబుదాబి: తమ దేశ గగనతలంపై అనుమతి లేకుండా యూఏఈ విమానాన్ని నడిపిందని, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని ఖతర్ వ్యాఖ్యానించడాన్ని యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రి డా. అన్వర్ మహమ్మద్ గర్గాష్ ఖండించారు. ఐక్యరాజ్యసమితిలో యూఏఈపై ఖతర్ ఫిర్యాదు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, ఆధారాలతో నిరూపిస్తామని, తమపై అభాండాలు మోపుతున్నారని, ఖతర్ వ్యాఖ్యలు అసత్యమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇదిలావుండగా యూఏఈకి చెందిన ఓ మిలిటరీ విమానం తమ గగనతలంపై ప్రయాణించిందని ఖతర్ చెపుతోంది. దీంతో ఖతర్, యూఏఈల మధ్య మరోసారి ఉద్రిక్తకర వాతావరణం కొనసాగుతోంది.