:: Welcome to NRI - Article ::

ఇంటి నుంచి దుబాయి యజమాని బయటకు వెళ్లగానే..

దుబాయి: చిన్న పని అని చెప్పి కొండంత పని చేయిస్తున్నాడో, జీతం ఇవ్వకుండా పని చేయించుకుంటున్నాడో లేక లైంగికంగా వేధిస్తున్నాడో కానీ.. ఓ దుబాయి యజమాని కళ్లుగప్పి ఇద్దరు మహిళలు ఇంటి నుంచి పారిపోయారు. ఎథియోఫియన్‌కు చెందిన ఇద్దరు మహిళలు పొట్టకూటి కోసం దుబాయికి వచ్చారు. ఓ అరబ్బు షేక్ ఇంట్లో పనికి కుదిరారు. ఓ రోజు మధ్యాహ్న సమయంలో ఓ బ్యాగును యజమాని ఓ బ్యాగును తన భార్యకు ఇచ్చి వెళ్లాడు. ఆమె దాన్ని బీరువాలో పెట్టింది. కొద్ది సేపటికి ఆమె స్నానానికి వెళ్లింది. అప్పటిదాకా వంటపని చేస్తున్న ఇద్దరు మహిళలు బెడ్‌రూమ్‌లోని బీరువా దగ్గరకు వెళ్లి, తమ పాస్‌పోర్టులు, వీసాలు తీసుకుని ఇంటి నుంచి పరారయ్యారు. కొద్ది సేపటి తర్వాత ఇంటికొచ్చిన యజమానికి భార్య అన్ని వివరాలు చెప్పింది. వెంటనే ఇంట్లోని అన్ని వస్తువులు ఉన్నాయా..? ఏమైనా పోయాయా..? అని చెక్ చేశారు. మొత్తానికి వాళ్ల పత్రాలతోపాటు 4000 దిర్హమ్స్‌ను కూడా దొంగిలించనట్లు గమనించి పోలీసులకు ఫోన్ చేశారు. ఈ యేడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన కేసు ఆదివారం విచారణకు వచ్చింది. ఇద్దరు మహిళలను పట్టుకున్న పోలీసులు.. ఈ కేసులో వివరాలను కోర్టుముందుంచారు. తాము పాస్‌పోర్ట్, వీసాలను మాత్రమే తీసుకెళ్లామనీ, డబ్బును అస్సలు ముట్టుకోలేదని మహిళలు చెబుతుండగా.. అదే బ్యాగులో ఉన్న డబ్బును వాళ్లు దొంగిలించారని యజమాని తేల్చిచెప్పాడు. ఇద్దరి వాదనలు విన్న దుబాయి కోర్టు ఈ తుది తీర్పును 15 రోజుల్లోగా వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అప్పటిదాకా మహిళలను తమ కస్టడీలోనే ఉంచుకోవాలని పోలీసులకు సూచించింది.