tusk-found-in-saudi-

3లక్షల 50 ఏళ్ల నాటి ఏనుగు దంతం..

రియాద్: సౌదీ ఎడారిలో 3లక్షల 50ఏళ్ల నాటి ఏనుగు దంతాలు కనుగొన్నారు. తైమా ప్రావిన్సులో ఒక ఎండిపోయిన సరస్సులో జరిపిన తవ్వకాల్లో ఏనుగు దంతాలతోపాటు మొసళ్లు ఇతర జంతువులకు సంబంధించిన అవశేషాలు కనిపించాయని సౌదీ అర్కియాలజిస్టు డాక్టర్. అలీ అల్ గాబ్బన్ తెలిపారు. ప్రస్తుతం ఎడారిలా కనిపిస్తున్న ప్రాంతం ఒకప్పుడు జంతువులు జీవించడానికి అనువైన ప్రాంతామని ఆయన అన్నారు. తైమాలో దొరికిన అవశేషాల వల్ల సౌదీ చరిత్ర ఈనాటిది కాదని తెలుస్తోందని అలీ చెప్పారు. మరికొన్ని తవ్వకాలు జరిపితే ఇంకా స్పష్టత వస్తుందని అలీ అభిప్రాయపడుతున్నారు.