:: Welcome to NRI - Article ::

తప్పుడు వార్తలతో నష్టం చేస్తున్నారు

ఇలాగైతే మీడియా లైసెన్స్‌లు రద్దు చేస్తాం: ట్రంప్

వాషింగ్టన్‌, అక్టోబరు 12:మీడియాలో వస్తున్న విమర్శనాత్మక కథనాలను ఓర్చుకోలేని తత్వం ఇప్పుడు అమెరికాకూ పాకింది. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మీడియాపై చర్యలు తప్పవని అధ్యక్షుడు  ట్రంప్‌ హెచ్చరించారు. దేశ అణు విధానంపై ఎన్‌బీసీ న్యూస్‌ ఒక కథనాన్ని ప్రసారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వైఖ రి కొనసాగితే మీడియా సంస్థల లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు. ఇక, ఉత్తరకొరియా విషయంలో ఏదోకటి చేయాల్సిందేనని ట్రంప్‌ అన్నారు. మరోవైపు, ఉత్తరకొరియాతో దౌత్య సంబంధాల స్థాయిని యూఏఈ, కువైత్‌, కతర్‌ దేశాల తగ్గించుకున్నాయి. వీసాల జారీని నిలిపివేశాయి.