trump-warned-iran

‘ఇదే చివరి వార్నింగ్..ఉల్లంఘనకు పాల్పడితే..’

వాషింగ్టన్: ఇరాన్‌తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇరాన్‌కు సహాయ నిధులు విడుదల చేసిన ఆయన 2015 అణు ఒప్పందాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నారు. ఇరాన్ మరోసారి అణు ఒప్పంద ఉల్లంఘటనకు పాల్పడితే సహాయ నిధులు విడుదల చేయబోమని ఆయన ఖరాఖండిగా చెప్పారు. అంతేకాకుండా అంతర్జాతీయ ఒప్పందాల నుంచి ఏకగ్రీవంగా వైదొలగుతామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు ఇదే చివరి అవకాశమని, ఒప్పందాల నుంచి వైదొలగేందుకు ఏమాత్రం వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరించారని వైట్‌హౌస్‌కు చెందిన ఓ కీలక అధికారి వెల్లడించారు. ఇరాన్ వ్యవహారాల శైలిపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారని అన్నారు.