:: Welcome to NRI - Article ::

ట్రంప్ సీక్రెట్ మీటింగ్..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఓ దేశపు మాజీ అధ్యక్షులతో రహస్య సమావేశమయ్యారు. గత వారం కొలంబియన్ మాజీ అధ్యక్షులతో ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో రిసార్ట్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ వివరాలను మియామి హెరాల్డ్ పత్రిక బయటపెట్టింది. కొలంబియా మాజీ అధ్యక్షులు అల్వారో ఎరిబే, ఆండ్రెస్ పాస్ట్రానా సంయుక్తంగా సమావేశమయ్యారట. వీరితో సమావేశం ఉన్నట్లు ప్రెసిడెంట్ రోజువారి కార్యక్రమాల లిస్ట్‌లో లేదనీ, ఎక్కడకు వెళ్లేది వెల్లడించకుండా ట్రంప్ రిసార్ట్‌కు వెళ్లారని మీడియా తెలిపింది. వీరి మధ్య సమావేశం జరిగిందని కొలంబియన్ మీడియా కూడా ధృవీకరించింది. రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్స్ ఆఫ్  కొలంబియాకు ఒబామా ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో 450 మిలియన్ డాలర్ల విదేశీ సాయాన్ని ప్రకటించారు. ఈ సాయాన్ని ప్రకటించడంలో కీలక పాత్ర వహించిన ఫ్లోరిడా రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో.. మాజీ దేశాధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారని తెలిపింది. కాగా ఈ సమావేశ వివరాలను మొదట వైట్‌హౌస్ ఖండించినా.. ఆ తర్వాత సమావేశం జరిగిందని తెలియజేసింది. క్లబ్‌లో ఉండగా హడావిడిగా వెళ్తున్న ప్రెసిడెంట్‌కు కేవలం ‘హలో’ మాత్రమే చెప్పారని వెల్లడించింది. 

 

 

Loading...