trump-says-he-has-a-good-relationship-with-kim-jong-un

నమ్మశక్యంకాని వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం నమ్మశక్యం వ్యాఖ్యలు చేశారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో తనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఉత్తరకొరియాతో త్వరలోనే దౌత్యపరమైన చర్చలను ప్రారంభించనున్నామని, ఈ విషయం తెలిస్తే ప్రజలు కూడా ఆశ్చర్యపోవడం ఖాయమని అన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ విలేకరికి ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాటలు పక్కన పెడితే ఇరుదేశాల మధ్య కొన్ని నెలలుగా ఉద్రికరమైన వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కిమ్‌ను ‘రాకెట్‌మ్యాన్’ వ్యవహరించిన ట్రంప్.. కిమ్ ప్రభుత్వాన్ని ‘క్రిమినల్స్ సమూహం’గా పేర్కొన్న సంగతి తెలిసిందే. పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేసుకున్న ఇరుదేశాధినేతల మధ్య ఇలాంటి వాతావరణం ఎప్పుడు ఏర్పడింది?..రాజకీయ కోణంలో ఈ వ్యాఖ్యలు చేశారా?..అనే అనుమానాలను అంతర్జాతీయ రాజకీయ నిపుణులు వెలిబుచ్చుతున్నారు. ఇదిలావుండగా ఉత్తర, దక్షిణకొరియా మధ్య సుధీర్ఘకాలం తర్వాత చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.