Trump-fires-on-CNN-and-washington

వాషింగ్టన్, సీఎన్ఎన్‌లపై విరుచుకుపడ్డ ట్రంప్

వాషింగ్టన్: తనపై తప్పుడు కథనాలను రాస్తున్నాయని ‘ద వాషింగ్టన్ పోస్ట్’, ‘సీఎన్ఎన్’ వార్తా సంస్థలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాతో అమెరికా వాణిజ్య చర్చల పట్ల అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా పై రెండు వార్తా సంస్థలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. చైనాకు సంబంధించిన ‘జెడ్‌టీఈ’ అనే సంస్థ మినహా చాలా పెద్ద ఒప్పందాలే జరిగాయని ఆయన వివరించారు. అవాస్తవాల్ని ప్రచారం చేయడం వల్ల సంవత్సరంలో చైనా-అమెరికా దాదాపు కొన్ని వందల బిలియన్ డాలర్లు నష్టపోయాయని ట్వీట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.