trump-dismisses-haithi

మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

వాషింగ్టన్: వలసదారులపై ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తమ దేశానికి ప్రయోజనం చేకూర్చని దేశాల పౌరులు తమ దేశంలో ఉండొద్దని వివాస్పద వ్యాఖ్యలు చేశారు. హైతీ దేశ పౌరులు ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారని ట్రంప్ అన్నారు.  వారి వల్ల దేశానికి జరుగుతున్న ప్రయోజనం శూన్యమని ట్రంప్ అన్నారు. గత పాలకులు ప్రవేశపెట్టిన ఇమ్మిగ్రేషన్ బిల్లు వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ ఆరోపించారు. ఇమ్మిగ్రేషన్ బిల్లులో సవరణలు చేయాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.