trump-comments-on-africans

ఆఫ్రికాపై ట్రంప్‌ ‘పెంట’ వాగుడు

వాషింగ్టన్‌, జనవరి 12: తమదేశ వలస విధానాన్ని కట్టడి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆఫ్రికా దేశాల నుంచి ఎవరినీ అమెరికాలోకి రానిచ్చేది లేదని శుక్రవారం తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ‘అవి పెంట దేశాలు’ అంటూ దూషించి, మరో వివాదానికి తెరతీశారు. ‘ఆఫ్రికన్లను మనమెందుకు భరించాలి? అవన్నీ పెంట దేశాలు.’ అన్నారు. మధ్య ఆసియా, నార్వే లాంటి దేశాలనుంచి వలసలు పెరిగితే మనకు మంచిది. ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది’ అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి.