Trump-another-decision-may-hit-china-companies

బ్రాడ్‌కామ్‌-క్వాల్‌కామ్‌ డీల్‌కు ట్రంప్‌ మోకాలడ్డు

దేశ భద్రతను సాకుగా చూపిన అమెరికా సర్కారు

న్యూఢిల్లీ:ప్రపంచ టెక్నాలజీ రంగంలో అతిపెద్ద ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్డుకట్ట వేశారు. సింగపూర్‌కు చెందిన మైక్రోచిప్‌ తయారీదారు బ్రాడ్‌కామ్‌ 11,700 కోట్ల డాలర్ల (రూ.7,60,500 కోట్లు)తో అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్‌ను కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది. కానీ దేశ భద్రతలను కారణంగా చూపుతూ ట్రంప్‌ సర్కారు ఈ డీల్‌ను నిరాకరించింది. ప్రతిపాదన దశలో ఉన్నప్పుడే ఈ కొనుగోలుపై ‘కమిటీ ఆన్‌ ఫారిన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఇన్‌ యునైటెడ్‌ స్టేట్స్‌’ (సిఎ్‌ఫఐయుఎస్‌) దర్యాప్తు చేపట్టింది. దేశ భద్రతను సాకుగా చూపి అనుమతివ్వలేమంది. సిఎ్‌ఫఐయుఎస్‌ అనేది అమెరికా ఆర్థిక శాఖ అధ్యక్షతన ఏర్పాటైన మల్టీ ఏజెన్సీ కమిటీ. విదేశీ కంపెనీలు అమెరికా వ్యాపారాల కొనుగోలులో జాతీయ భద్రతకు భంగం వాటిల్లుతుందా అన్న దిశగా ఈ కమిటీ దర్యాప్తు చేస్తుంది.
 
చైనా కంపెనీ హువేను నిలువరించేందుకేనా..?
థర్డ్‌ పార్టీ సంస్థలతో బ్రాడ్‌కామ్‌కున్న సన్నిహిత సంబంధాలు భవిష్యత్‌లో తమకు ప్రమాదంగా పరిణమించవచ్చన్న అమెరికా భయాలే ఈ డీల్‌ ను అడ్డుకోవడానికి అసలు కారణమని తెలుస్తోంది. స్వల్పకాలిక లాభాల కోసం బ్రాడ్‌కామ్‌ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డి) విభాగాల్లో పెట్టుబడులను భారీగా తగ్గించే అవకాశం ఉంద ని, దాంతో చైనా కంపెనీ హువే టెక్నాలజీస్‌ కంపెనీ ప్రధాన సరఫరాదారుగా అవతరించే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన. ఆధునిక టెక్నాలజీ సరఫరా వియంలో ఇప్పటికే హువే, క్వాల్‌కామ్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. క్వాల్‌కామ్‌ బ్రాడ్‌కామ్‌లో విలీనమైతే భవిష్యత్‌లో హువేపైనే ఆధారపడాల్సి వస్తోందని రక్షణ విభాగాలు ఈ డీల్‌పై అఽభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.