Transit-passengers-to-enjoy-day-out-in-UAE-under-new-visa-policy

నూతన వీసా విధానానికి గ్రీన్ సిగ్నల్ !

అబుదాబి: పర్యాటకరంగ అభివృద్ధి లక్ష్యం, ప్రయాణికుల సౌకర్యార్థం యూఏఈ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. నూతన వీసా విధానాన్ని తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూఏఈలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు పర్యటకులకు ట్రాన్సిట్ వీసాను జారీ చేయాలని భావిస్తోంది. ఈ నూతన వీసా విధానం ప్రకారం ... పర్యటకులకు అన్నీ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఒక రోజంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఈ మేరకు యూఏఈ కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో యూఏఈలోని పలు పర్యటించాలనుకునేవారికి ఈ నూతన విధానం ఉపయుక్తం కానుంది. ఇదివరకు ఉన్న వీసా విధానంలో ఎంచుకున్న ప్రాంతంలోని విమానాశ్రయం నుంచి మాత్రమే ప్రయాణించాలనే నిబంధన ఉండేంది. ఇతర విమానాశ్రయాల ద్వారా ప్రయాణించడానికి వీలులేదు. దీంతో నూతన విధానం పర్యాటకులకు సౌకర్యవంతంగా మారనుందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూఏఈలో పర్యటించేవారి సంఖ్య అధికంగానే ఉంటుందన్న తెలిసిందే.