tollywood-sex-rocket-

టాలీవుడ్ న‌టీమ‌ణుల‌తో అమెరికాలో వ్య‌భిచారం!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌గా అవ‌కాశాలు సంపాదించుకోలేక‌పోతున్న‌ యంగ్ హీరోయిన్లకు వ‌ల వేస్తారు. వారికి తాత్కాలిక వీసాలు ఇప్పించి ఆమెరికాకు ర‌ప్పిస్తారు. అధిక ధనం ఆశ చూపి వ్య‌భిచారంలోకి దింపుతారు. భార‌తీయ స‌భ‌లకు, స‌మావేశాల‌కు వీరిని తీసుకెళ్లి.. హీరోయిన్ల‌తో శృంగారం అంటూ విటుల‌ను ఆక‌ర్షిస్తారు. ఇదీ, షికాగోలో నివ‌సిస్తున్న ఓ తెలుగు జంట చేస్తున్న హై-లెవెల్ వ్య‌భిచారం.

 తాజాగా ఈ హైలెవెల్ వ్య‌భిచారం గుట్టును అమెరికాలోని ఫెడ‌ర‌ల్ ఏజెన్సీలు ర‌ట్టు చేశాయి. ఈ వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న తెలుగు దంప‌తుల‌ను అరెస్ట్ చేశాయి. ఈ కేసుకు సంబంధించి 42 పేజీల నివేదిక‌ను షికాగో జిల్లా కోర్టులో స‌మ‌ర్పించ‌డంతో ఈ షాకింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసులో కిష‌న్ మోదుగుమూడి, ఆయ‌న భార్య చంద్ర‌ను గ‌త ఏప్రిల్ నెల‌లోనే ఫెడ‌ర‌ల్ ఏజెన్సీలు అరెస్ట్ చేశాయి. వ్యాపార‌వేత్త అయిన కిష‌న్ ప‌లు హిట్ తెలుగు సినిమాల‌కు స‌హ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్లు తాత్కాలిక వీసాల మీద అమెరికా వ‌చ్చి వీరి నేతృత్వంలో వ్య‌భిచారం సాగించిన‌ట్టు స్థానిక పత్రిక వెల్ల‌డించింది. వీరు విటుల వ‌ద్ద నుంచి మూడు వేల డాల‌ర్లు (దాదాపు 2 ల‌క్ష‌ల రూపాయ‌లు) వ‌సూలు చేస్తున్న‌ట్టు ఫెడ‌ర‌ల్ ఏజెన్సీ పేర్కొంది.
 
క్రిస్‌మ‌స్ సంద్భంగా గతేడాది ఓ యువ హీరోయిన్‌ను అమెరికాకు ర‌ప్పించి వ్య‌భిచారం నిర్వ‌హించ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. త‌న‌ను వేధించ‌వ‌ద్ద‌ని, త‌న‌కు ఎలాంటి హానీ చేయ‌వ‌ద్ద‌ని ఆ యువ హీరోయిన్ రాసిన ఈ-మెయిల్ ఆధారంగానే ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసుకు సంబంధించినంత‌వ‌ర‌కు ఆ హీరోయిన్‌ను.. ఫెడ‌ర‌ల్ పోలీసులు బాధితురాలిగానే చూస్తున్నారు. ఆమెను `విక్టిమ్‌-ఎ`గా పేర్కొంటున్నారు. ఇక‌, కిష‌న్ భార్య చంద్ర ఈ సెక్స్ రాకెట్‌కు సంబంధించి లెక్క‌లు రాసుకోవ‌డం, విటుల‌తో డ‌బ్బులు గురించి మాట్లాడ‌డం వంటి విష‌యాల‌ను డీల్ చేసేద‌ట‌. ఆమె ఫోన్ ద్వారానే విటుల‌తో బేర‌సారాలు సాగించేద‌ట‌. కాగా, కిష‌న్ ఇంటిపై దాడి చేసిన‌పుడు అక్క‌డున్న ఓ బ్యాగ్‌లో 70 కండోమ్‌లు దొరికాయ‌ని పోలీసులు కోర్టుకు స‌మ‌ర్పించిన నివేదిక‌లో పేర్కొన్నారు.