To-transport-a-dead-body-from-America-to-India

అమెరికా నుంచి మృతదేహాన్ని భారత్‌కు తరలించాలంటే..

మృతదేహం తెచ్చేందుకు తీసుకోవాల్సిన అనుమతులు

యూసఫ్‌గూడ, హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో మృతిచెందిన వారి మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావటానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాలి.. వాటికి సాధారణంగా ఎంత సమయం పడుతుందనే అంశాలను నిపుణుల ద్వారా ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది.  
 
అమెరికాలో జీవిస్తూ ఏదైనా కారణంచేత మృతి చెందిన వారిని మన దేశానికి తీసుకు రావటానికి ఐదు అంచలుగా తీసుకుని రావాల్సి ఉంటుంది.
మొదటగా మృతదేహాన్ని ఆస్పత్రి వర్గాలు పోస్టుమార్టం నిర్వహించి సర్టిఫికేట్‌ ఇవాల్సి ఉంటుంది.
పోస్టుమార్టం రిపోర్ట్‌ అందాక అక్కడి స్థానిక పోలీసులు మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అనుమతి ధ్రువపత్రం ఇస్తారు.
పోలీస్‌ వారి ధ్రువపత్రం, పో స్టుమార్టం ధ్రువపత్రం ఆధారంగా సంబంధిత నగరానికి చెందిన మున్సిపల్‌ కార్యాలయంలో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 
అనంతరం మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఈ ధ్రువపత్రాల ఆధారంగా అక్కడి విదేశీ వ్యవహారాల శాఖకు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి వస్తుంది.
ఇలా నాలుగు చోట్లా ధ్రువపత్రాలు పొందిన తరువాత ఎయిర్‌లైన్స్‌లో మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.
 
నాలుగురోజుల ప్రాసెస్‌ ఇది..
అమెరికాలో ఎవరైనా సహజంగా మరణించినా కూడా ఈ దశలు దటిన తరువాతే మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ ప్రక్రియలన్నీ జరిగేందుకు కనీసం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.