Tight-security-in-Airports

ఎయిర్‌పోర్టులలో భద్రత పెంపు

న్యూఢిల్లీ, జూన్‌ 12: హైదరాబాద్‌, విశాఖపట్నంసహా ఎంపిక చేసిన 10 విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. ఈ ఎయిర్‌పోర్టులలో అదనంగా 1172 మందిసీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని నియమించారని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు, ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు భద్రతను పటిష్ఠం చేశామని తెలిపారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, పట్నా, బాగ్‌డోగ్రా, తిరువనంతపురం, జైపూర్‌, గోవా, ఔరంగాబాద్‌, మదురై ఎయిర్‌పోర్టులలో అదనపు భద్రతా సిబ్బందిని నియోగించారు. విజయవాడ ఎయిర్‌పోర్టు భద్రతా పర్యవేక్షణను త్వరలో సీఐఎస్‌ఎఫ్‌ చేపట్టనున్నది.