:: Welcome to NRI - Article ::

పిడుగు పడుతుండగా.. వీడియో తీసి..

వాషింగ్టన్: వర్షంలో ఆడుకోవడమంటే పిల్లలకు ఎంతో సరదా. అయితే కొన్నిసార్లు ఆ సరదా వారి ప్రాణాల ఎసరు పెడుతోంది. 12 ఏళ్ల బాలుడు ఉదయమే వర్షంలో ఆడుకుంటున్నాడు. ఇంటి చూరు నుంచి వర్షం నీరు కారుతుండటంతో అతడు గొడుగు పట్టుకుని అక్కడే నిలబడి ఉన్నాడు. ఇంట్లో నుంచి బాలుడి తల్లి వీడియో తీస్తోంది. కొద్దిసేపటి తర్వాత బాలుడికి చూపిద్దామని అనుకున్నానని ఆమె చెప్పింది.

వర్షం నీటిలో ఆడుకుని బాలుడు నడుచుకుంటూ వెళ్తుండగా సడెన్‌గా ఒక పెద్ద మెరుపు మెరిసింది. పిడుగు కూడా పడింది. ఏం జరిగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. బాలుడు పక్కకు ఒరిగిపోయాడు. బాబు చేతిలో గొడుగు ఉండటం వల్లే పిడుగు అతడిపై పడలేదని అతడి తల్లి చెప్పింది.