This-app-will-be-

గూగుల్‌లో ఈ యాప్ ఇక కనపడదు?

కాలిఫోర్నియా: ప్రముఖ సెర్చింజన్ గూగుల్ మెసేజింగ్ యాప్ ‘ఆలో’ 2019 మార్చి నుంచి కనుమరుగుకానుంది. 2016 సెప్టెంబర్‌లో ఈ యాప్‌ను ఆవిష్కరించారు. అయితే వినియోగదారుల నుంచి పెద్దగా స్పందనరాలేదు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్టుబడులు నిలిపివేసిన గూగుల్.. వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తిగా యాప్ కార్యక్రమాలను నిలిపివేయనున్నట్టు తమ అధికారిక బ్లాగ్‌లో తెలిపింది. ఎస్ఎంఎస్‌ పంపిణీ నిర్వహణ తీరును మరింత మెరుగుపరిచి.. వినియోగదారుల మెప్పు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు గూగుల్ తెలిపింది.