There-is-no-longer-a-Nuclear-Threat-from-North-Korea-says-trump

అమెరికన్లకు ట్రంప్ భరోసా..

వాషింగ్టన్: సింగపూర్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో చరిత్రాత్మక భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా చేరుకున్నారు. కిమ్‌తో చర్చల తర్వాత అమెరికన్లకు భద్రతాపరమైన భరోసా ఇస్తూ ఆయన ఆసక్తికరమైన ఓ ట్వీట్ చేశారు.
 
‘‘ సుధీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడే అమెరికా చేరుకున్నా. భద్రతపరంగా నేను ప్రమాణస్వీకారం చేసిన రోజుతో పోల్చితే అమెరికా ప్రస్తుతం సురక్షితమని ప్రతీఒక్కరూ భావించాలి. ఉత్తరకొరియా నుంచి అమెరికాకు అణ్వస్త్ర ముప్పు ఇక ధీర్ఘకాలం కాదు. కిమ్‌తో జరిగిన సమావేశం చాలా ఆసక్తికరంగా, సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. భవిష్యత్తుకు సంబంధించి ఉత్తరకొరియాకు గొప్ప శక్తి ఉంది. నేను పదవి చేపట్టకముందు ఉత్తరకొరియాతో యుద్ధం జరిగే అవకాశం ఉందని ప్రజలు భావించారు. అమెరికాకు పొంచివున్న అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన సమస్య ఉత్తరకొరియా అని ఒబామా కూడా అన్నారు. కానీ ఇక భయం ఎంతోకాలం కాదు. ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి’’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై అమెరికన్లు భారీగా స్పందించారు. పలువురు ప్రశంసించారు.