:: Welcome to NRI - Article ::

జపాన్‌లోనూ భయం.. భయం

వాషింగ్టన్: ఉత్తరకొరియా తాజా హెచ్చరికలతో జపాన్ ఉలిక్కిపడుతోంది. 2009లోనే ఉత్తరకొరియా మిస్సైల్ ప్రయోగాలు జరిపింది. అప్పుడు జపాన్ ప్రధాన భూభాగాల గుండా ఆ మిస్సైల్ ప్రయోగం జరిగిందని జపాన్ ఆ సమయంలో ఉత్తరకొరియాను ప్రశ్నించిందని అయితే టెలికమ్యూనికేషన్‌ శాటిలైట్‌నే తాము ప్రయోగించామని న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగించలేదని ఉత్తరకొరియా సమాధానమిచ్చిందని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషియే సుఘా అమెరికా మీడియాకు తెలిపారు. కానీ, ఉత్తరకొరియా తమకు హని తలపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పటికే జపాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారని సుఘా చెబుతున్నారు.

అమెరికా కూడా ఉత్తరకొరియా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నందున జపాన్ దైర్యంగా ఉందని ఆయన అన్నారు. యుద్ధానికి కావాల్సిన పైరేట్ అడ్వన్స్‌డ్ కేపబులిటీ(పీఎసీ-3) సిస్టంను జపాన్ అమెరికాకు అందిస్తున్నట్లు జపాన్ రక్షణ శాఖ తెలిపింది. అణుబాంబుల జాడను పసిగట్టే ఈ టెక్నాలజీ అమెరికా సైన్యానికి ఎంతో ఉపయోగపడుతుందని జపాన్ రక్షణశాఖ చెబుతోంది.

Loading...