:: Welcome to NRI - Article ::

'అమెరికా బాంబు కన్నా పదిరెట్లు పెద్దది'

వాషింగ్టన్: ఉత్తరకొరియాను తక్కువగా అంచనా వేయడం పెద్ద తప్పవుతుందని అమెరికా ఇంటలిజెన్స్ హెచ్చరిస్తోంది. తాజా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగ ప్రకటనతో ఉత్తరకొరియా మరోసారి ఉద్రిక్తలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఇంటలిజెన్స్ ఆరోపించింది. జపాన్‌పై రెండో ప్రపంచయుద్ధ సమయంలో అమెరికా వేసిన అణుబాంబు కన్నా పెద్దదైన హైడ్రోజన్ బాంబును ప్రయోగించి ఉత్తరకొరియా సంచలనమే సృష్టించిందంటోంది.

అయితే ఆ ప్రయోగాల వెనుక ఉత్తరకొరియా ఉద్దేశం మాత్రం ఒకటేనని అమెరికా ఇంటలిజెన్స్ పేర్కొంది. అమెరికా ప్రధాన నగరాలను తాకేలా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగిస్తామని గతంలో ఎన్నోసార్లు ఉత్తరకొరియా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తోంది. అమెరికా ప్రయోగించిన బాంబు కంటే పదిరెట్లు పెద్దదైన హైడ్రోజన్ బాంబును ఉత్తరకొరియా సొంతంగా తయారుచేయగలదని అమెరికా ఊహించలేకపోయిందని ఇంటలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే ఉత్తరకొరియా ఆర్థిక వనరులను దెబ్బతీయడం ద్వారా బాలిస్టిక్ ప్రయోగాలను అడ్డుకోవచ్చనుకుంటే అది సాధ్యపడలేదన్నారు.