ten-thousand-women-drivers-

సౌదీలో 10 వేల మంది మహిళా డ్రైవర్లు..

రియాద్: సౌదీ ప్రభుత్వం కొన్ని నెలలక్రితమే మహిళలు కూడా కారు డ్రైవ్ చేయొచ్చని ప్రకటించింది. దాంతో ఎంతో మంది ఉపాధి అవకాశాలకు గండిపడే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది. నిజానికి షేక్‌ల ఇళ్లల్లో డ్రైవర్లుగా పనిచేసేందుకు ఎన్నో దేశాల నుంచి సౌదీకి వస్తుంటారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ప్రస్తుతం పది వేల మంది మహిళలకు సౌదీ ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తోందని తెలిపింది. దాంతో విదేశీ డ్రైవర్లకు అవకాశాలు తగ్గనున్నాయని పేర్కొంది. సౌదీలో క్యాబ్ సర్వీసులు నడుపుతోన్న ఉబెర్, కరీమ్ వంటి సంస్థలు కూడా మహిళా డ్రైవర్లను నియమించుకునేందుకు సిద్ధమవుతున్నాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది.