temperature-crosses

ఉష్ణోగ్రత పెరగనుందని..

దుబాయ్: ఉష్ణోగ్రత 51 డిగ్రీలు తాకుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే గాలి కూడా వేగంగా వీచే అవకాశం ఉందంటున్నారు. అందువల్ల గాలిలో ఇసుక రేణువులు నిండిపోతాయని వారు చెబుతున్నారు. గాలి వీచే వేగం పెరగడం వల్ల ఇసుక రేణువులు గాలిలో కలిసి వాహనదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉందంటున్నారు.

ఇటువంటి సందర్భాల్లో వాహనదారులు జాగ్రత్తగా తమ వాహనాలను డ్రైవ్ చేయాలని వారు సూచిస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.