Telugu-student-died-in-America

రైలు ఢీకొని.. అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

మృతుడు ప్రకాశం వాసి

పామూరు(ప్రకాశం), జూన్‌ 12: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో తెలుగు విద్యార్థి దుగ్గినేని దీపక్‌ దుర్మరణం చెందారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని మోడ్రన్‌ రెసిడెన్సీ, మోడ్రన్‌ కేఫ్‌ హోటల్‌ నిర్వాహకుడైన దుగ్గినేని వెంకట్రావు, రమాదేవిల ఏకైక కుమారుడు దీపక్‌ అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నారు. టెక్సా్‌సలోని డీమోంట్‌లో నివాసం ఉంటున్న దీపక్‌ స్నేహితుడిని రైలు ఎక్కించేందుకు స్టేషన్‌కు వెళ్లారు.
 
ఈ సందర్భంగా రైలు తగిలి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న తమ కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీపక్‌ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు బంధువులు ప్రయత్నిస్తుస్తున్నారు. మూడేళ్ల క్రితం దీపక్‌ అమెరికాలో తన స్నేహితులతో కారులో ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన స్నేహితుడు మృతిచెందగా, దీపక్‌ ప్రమాదం నుంచి బయట పడ్డాడు.