Telugu-student-death-in-America-is-mysteries

అమెరికాలో దీపక్‌ మృతిపై పలు అనుమానాలు

హత్యా, ఆత్మహత్యా కోణంపై విచారణ చేపట్టాలని తల్లిదండ్రుల డిమాండ్‌ 

పామూరు, ప్రకాశం జిల్లా, జూన్‌ 13 : చదువులో చురుగ్గా ఉంటూ ఉద్యోగ అన్వేషణలో ఉన్న తన కుమారుడి ఆకస్మిక మృతిపై పలు అనుమానాలు తమకు ఉ న్నాయని అది హాత్యా లేక ఆత్మహాత్యా ఆ దిశగా దర్యాప్తు చేపట్టి తమకు న్యాయం చేయాలని దీపక్‌ తల్లితండ్రులు దుగ్గినేని వెంకట్రావు కోరుతున్నారు. పామూరుకు చెందిన దుగ్గినేని దీపక్‌ అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో డీమోంట్‌లో నివాసం ఉంటూ అక్కడ ఎంఎస్‌ విద్యను పూర్తి ఉద్యోగ అన్వేషణలో ఉన్న సమయంలో రైలు ప్రమాదంలో  చనిపోయినట్టు అక్కడ నుంచి సమాచారం రావటం పట్ల పలు అనుమానాలు రేకితిస్తున్నాయి. దీపక్‌ మృతి ప్రమాదవశాత్తు జరిగిందా మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ప్రాంతీయ తత్వంతో హాత్య జరిగిందా అనే కోణాల్లో విచారణ చేపడితే వాస్తవాలు బయటపడతాయని దీపక్‌ తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటే విపరీతమైన అంక్షలు నేపథ్యంలో ఎక్కడ తమకు ఉద్యోగం రాదోనని ఆదిశగా మానసికంగా కుంగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనేది ఒక బలమైన వాదన వినిపిస్తుంది. ఏదీ ఏమైనా దీపక్‌ మృతిపై న్యాయవిచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. దీపక్‌ మృతదేహాన్ని ఇండి యాకు తెచ్చేందుకు బందువులు విస్వప్రయ త్నం చేస్తున్నారు. ఇండియా దీపక్‌ మృతదేహాం రావటానికి 5 రోజులు సమయం పడుతుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.