telugu-poem-in-texas-

“తెలుగుపద్యం - సంగీతస్వరకల్పన”

ఉత్తరటెక్సాస్ తెలుగుసంఘం (టాంటెక్స్ )సాహిత్యవేదిక ఆధ్వర్యంలో 130వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమం మే20వ తేదీ (ఆదివారం),ఇర్వింగ్లోలో జరిగింది. ఈ వేడుక సాహిత్యవేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారుల ప్రార్ధనా  గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. ఊరిమిండి నరసింహా రెడ్డి తెలుగు సిరిసంపదలు అనే అంశం మీద మాట్లాడుతూ తెలుగు  సామెతలు మీద ఆసక్తికరమైనఅంశాలు తెలియజేశారు. డా.పుదూర్ జగదీశ్వరన్గారు ఆముక్తమాల్యద నుంచి "నటత్పయోబ్దివీక్ష్య.." అనే సీసపద్యంలో శ్రీకృష్ణదేవరాయల వారి గంభీర వర్ణన చక్కగా వివరించారు. మాసానికో మహనీయుడు అనే అంశంపై సుబ్బుజొన్నలగడ్డ మాట్లాడుతూ మే నెలలో చలం తదితర గొప్ప కవులను స్మరించుకొన్నారు. తెలుగు చమక్కులు అనే అంశంపై దయాకర్మాడ చక్కని ప్రసంగం చేశారు.

ఫొటోల కోసం క్లిక్ చేయండి

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎర్రాప్రగడరామకృష్ణ విచ్చేశారు. ఆయనను సుబ్బుజొన్నలగడ్డ పుష్పగుచ్చంతో సత్కరించారు. ఆయనను కోడూరు కృష్ణారెడ్డి సభకు పరిచయం చేశారు. ఎర్రాప్రగడ వంశీబర్కీలీ, అంతర్జాతీయ ఒవైసీ అవార్డుగ్రహీత ప్రముఖదినపత్రికలో ఎన్నోవేల వ్యాసాలు రాశారు. “తెలుగుపద్యం - సంగీతస్వరకల్పన”అనే అంశంపై అమితాసక్తి కలిగించే ప్రసంగం చేశారు. తెలుగు పద్యం అర్ధం చేసుకోవడానికి అత్యున్నత మానసికస్థితి అవసరం అని ప్రతి పద్యాన్ని భావుకతతో చదివినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది అని చెప్పారు. వెయ్యి సంవత్సరాలకు పైగా తెలుగు పద్యం ఎందుకు నిలబడింది అంటే దాని నిర్మాణాత్మక విలువలే కారణం అని తెలిపారు. పద్యాన్ని రాగయుక్తంగా చదవడం ఎంతో అవసరం అని రాగం మారినప్పుడు పద్యంలో సాంద్రత, ఆర్ద్రత మారుతాయి. నిజమైన అర్ధం మరుగున పడుతుంది అని చెప్పారు. హరిశ్చంద్ర నాటకాన్ని మాధవపెద్దివెంకటరామయ్య  వేసినట్లు వేరెవరకి సాధ్యపడదు అని, సావిత్రి మంగళ సూత్ర ఘట్టాన్నిరమ్యంగా పాడి వినిపించారు. ఎర్రాప్రగడ రామకృష్ణ రాగ యుక్తంగా పాడిన పద్యాలకు సభ్యుల జేజేలు,చప్పట్లు,ఈలలతో స్పందన తెలియజేశారు.

ఎర్రాప్రగడ రామకృష్ణ టాంటెక్స్ సాహితీ కమిటీ సభ్యులు, టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణిశీలం, ఉత్తరాధ్యక్షులు చినసత్యం వీర్నపు, పాలక మండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి ఎర్రాప్రగడ రామకృష్ణ  కృతజ్ఞతలు తెలియచేయడంతో కార్యక్రమం ఘనముగా ముగిసింది.