:: Welcome to NRI - Article ::

కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి

ఇంటికి చేరిన మృతదేహం

కరీంనగర్, ఎల్లారెడ్డిపేట:ఉన్న ఊరిలో ఉపాధి కరువై కువైట్‌ దేశానికి వలస వెళ్లిన ఓ యువకుడు అక్కడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహం గురువారం ఇంటికి చేరింది. వివారాల్లోకి వెళితే ఎల్లారెడ్డి పేట మండలం పదిరె గ్రామానికి దొంతరవేణి దేవ రాజు(28) అనే యువకుడు కొంతకాలం క్రితం అప్పు లు చేసి కువైట్‌ దేశానికి వెళ్లాడు. ఈనెల 8న కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో దేవ రాజు అక్కడిక్కడే మృతి చెందాడు. దేవరాజు మృతదేహం తన స్వగ్రామమైన పదిరెకు చేరుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో మృతుడి భార్య భార్య స్రవంతి, కూతురు వర్షిణి (5), కోడుకు మణ్విక్‌లు కన్నీటి పర్యంతమ య్యారు. గల్ఫ్‌ బాధి త కుటుంబాన్ని మండల సెస్‌ డైరెక్టర్‌ కుంబాల మల్లారెడ్డి పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు.