:: Welcome to NRI - Article ::

16 ఏళ్ల టీనేజర్ 17 సెకన్లలో అసాధ్యమైన పని

పెర్త్: కొందరు వ్యక్తులకు కొన్నికొన్ని విషయాల్లో అద్భుత నైపుణ్యాలు ఉంటాయి. అందరినీ ఆకట్టుకునేలా ఆ రంగాల్లో రాణించుతారు. తాను కూడా ఇలాంటి వ్యక్తుల కోవలోకే చెందుతానని, అసాధ్యమైన పనిని చేసి తానేంటో నిరూపించుకున్నాడు ఓ కుర్రాడు. పెర్త్ నగరానికి చెందిన డానియేల్ థాయ్ అనే 16 ఏళ్ల టీనేజర్ రుబిక్స్ క్యూబ్ పజిల్‌ను కేవలం 17 సెకన్లలోనే పూర్తి చేసి అబ్బురపరిచాడు. ట్రైన్‌లో వెళ్తోన్న ఈ కుర్రాడు జనసందోహ అరుపుల మధ్య ఈ ఫీట్‌ను సాధించాడు. జనాల అల్లరి లేకుంటే కేవలం 15 సెకన్లలోనే పూర్తి చేయగలనని ధీమాగా చెప్పాడు. ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్లో చిత్రీకరించిన కొందరు వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో కుర్రాడిని పలువురు పొగడ్తలతో ముంచెత్తున్నారు.

Loading...