:: Welcome to NRI - Article ::

నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన టాంటెక్స్

జనవరి 8, 2017, డాలస్/ఫోర్ట్ వర్త్:అమెరికాలో తెలుగువారికి విశేష సేవలందిస్తున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాoటెక్స్ ) వారు 2017 సంవత్సరానికిగానూ నూతన కార్యవర్గాన్ని ఎంపికచేసుకుంది. జనవరి 8న ఇర్వింగ్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డ్ సమావేశంలో ఈ కార్యవర్గాన్ని ప్రకటించారు. సంస్థ అధ్యక్షుడిగా ఉప్పలపాటి కృష్ణారెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించారు. టాoటెక్స్ లాంటి గొప్ప సంస్థకి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాoటెక్స్‌ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినoదుకు టాoటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. 

 
అధికారిక కార్యనిర్వాహక బృందం
అధ్యక్షుడు : ఉప్పలపాటి కృష్ణా రెడ్డి
సంయుక్త కార్యదర్శి : కోడూరు కృష్ణారెడ్డి
ఉత్తరాధ్యక్షులు: శీలం కృష్ణవేణి
కోశాధికారి: గోవాడ అజయ్
ఉపాధ్యక్షుడు : వీర్నపు చిన్నసత్యం
సంయుక్త కోశాధికారి: మండిగ శ్రీలక్ష్మి
కార్యదర్శి : కాజ చంద్రశేఖర్ 
 
తక్షణ పూర్వాధ్యక్షులు: జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఆదిభట్ల మహేష్ ఆదిత్య, పాలేటి లక్ష్మి, బిళ్ళ ప్రవీణ్, సింగిరెడ్డి శారద, కొణిదల లోకెష్ నాయుడు, బ్రహ్మదేవర శేఖర్ రాజ్, పార్నపల్లి ఉమా మహేష్, పద్మశ్రీ తోట, తోపుదుర్తి ప్రభంద్ రెడ్డి, కసగాని మనోహర్, లంక భాను, ఎర్రం శరత్, ఇల్లెందుల సమీర.
 
పాలక మండల బృందం
అధిపతి : రొడ్డ రామకృష్ణరెడ్డి, 
ఉపాధిపతి: పావులూరి వేణుమాధవ్
డా. సిరిపిరెడ్డి రాఘవ రెడ్డి, పుట్లూరు రమణ, రుమాళ్ళ శ్యామ, కొనార రామ్, కన్నెగంటి చంద్రశేఖర్,
 
కొత్త కార్యవర్గ బృందంతో, సరికొత్త ఆలోచనలతో 2017వ సంవత్సరంలో అందరినీ అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ అధ్యక్షులు తెలిపారు. 2016 సవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా ఇటీవలే పదవీ విరమణ చేసిన తక్షణ పూర్వాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ “ఉప్పలపాటి కృష్ణారెడ్డి నేతృత్వంలో ఏర్పడిన 2017 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు. టాంటెక్స్ చేసే సేవా కార్యక్రమాల వివరాలుకు www.tantex.org సందర్శించవచ్చు.