take-care-when-going-to-gulf-says-pravaasandhralaseva-kendram

గల్ఫ్ వెళితే తగిన జాగ్రత్తలు తప్పనిసరి

ప్రవాసాంధ్రుల సేవాకేంద్రం అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం అర్బన్, జూన్ 13: గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రవాసాంధ్రుల సేవాకేంద్రం అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు హెచ్చరించారు. గల్ఫ్ హెల్ప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక కేంద్రం వద్ద నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఏజెంట్ల మోసాలకు ఎంతోమంది బలైపోతున్నారన్నారు. ప్రభుత్వం సూచనలు, సలహాల మేరకు వెళ్లడం వల్ల గల్ఫ్ దేశాల్లో భరోసా ఉంటుందన్నారు. వృత్తి నైపుణ్యం పెంచుకోని వారు అక్కడ పనులు చేయలేక నానాఅవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించి ఇక్కడ అప్పులు తీర్చుకుందామని వెళ్లిన ఎంతోమంది అక్కడ మోసాలకు బలై ఇరుక్కు పోతున్నారన్నారు. ఇలాంటి వారికి రక్షణగా ప్రభుత్వం, ప్రవాసాంధ్రుల సేవాకేంద్రం ఉన్నాయన్నారు. అయితే ముందుగా ప్రభుత్వాలు అందించే శిక్షణ తీసుకుని వెళితే గల్ఫ్‌లో మంచి అవకాశాలు ఉంటాయని, ఇబ్బందులు కూడా తగ్గుతాయని చెప్పారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గల్ఫ్ బాధిత కుటంబాల నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాయిశ్రీ, చెక్కా ఇస్రాయేలు రాజు, రామగని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.