:: Welcome to NRI - Article ::

సృతిమించిన సరదాపని..ఊపిరాకపోవడంతో..

కువైట్: ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. రకరకాల ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసే ఔత్సాహికుల సంఖ్య ఎక్కువైంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రాంక్(సరదా కోసం) వీడియోలు పోస్టు చేయడం ఎక్కువైంది. ఇతరులను ఆట పట్టించాలనే ఆలోచనతో ప్రమాదాలను ఊహించలేకపోతున్నారు. సరదా కోసం చేసే ఈ పనులు ప్రమాదకరంగా మారతాయి. ఇదేకోవకు చెందిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. కువైట్‌లోని ఓ బాలికల స్కూల్లోని విద్యార్థులను ఆటపట్టించేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నించారు. తరగతి గదిలో టపాసులు పేల్చారు. ఏమీ తెలియనట్లుగా మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినట్లు నటించారు. మంటలు ఆర్పడానికి ఎక్కువగా గ్యాస్‌ వదిలారు. దీంతో  తరగతి గదిలోని దాదాపు 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. బాధిత విద్యార్థినులను దగ్గరలోని జహ్రా హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించారు. వెంటనే చికిత్స అందించడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ చర్యకు పాల్పడిన విద్యార్థులు తమ సెల్‌ఫోన్లలో బంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై జహ్రా ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ అధికారులు స్పందించారు. ఘటనకు బాధ్యులైన విద్యార్థులను స్కూల్ నుంచి తొలగించారు. విద్యార్థులకు ఎటువంటి హానికరమైన పనికి పాల్పడినా సహించేదిలేదని అధికారులు తెలిపారు.