student-jailed-ten-years-for-carrying-drugs-

దుబాయ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ యువతి..శిక్ష ఇదే..

అబుదాబి: గల్ఫ్ దేశం యూఏఈలో డ్రగ్స్ వాడకం నిషేధం. డ్రగ్స్ అక్రమ రవాణా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ నిబంధనలు ఉల్లఘించినవారు కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. సుడాన్‌కు చెందిన 24 ఏళ్ల యువతి యూఏఈలోని దుబాయ్‌లో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో సుడాన్ నుంచి దుబాయ్ వెళ్లిన యువతి వద్ద డ్రగ్స్ పట్టుబడ్డాయి. నిందితురాలి బ్యాగులో గంజాయితోపాటు ట్రమడోల్, అంఫేటమైన్, మెథంఫెటమైన్ అనే నార్కోటిక్ డ్రగ్స్ లభ్యమయ్యాయి. మూత్ర పరీక్ష నిర్వహించగా నిందిత యువతి కూడా డ్రగ్స్ తీసుకుందని తేలింది. దీంతో నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కోర్టులో విచారణ పూర్తైంది. నిందితురాలికి 10 ఏళ్ల జైలుపడింది. 50 వేల దిర్హమ్స్ జరిమానా చెల్లించాలని నిందితురాలిని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా శిక్షాకాలం ముగిసిన అనంతరం నిందితురాలిని యూఏఈ నుంచి స్వదేశానికి పంపించివేయాలని ఆదేశించింది. ఈ తీర్పును 15 రోజుల్లోగా నిందితురాలు కోర్టులో సవాల్ చేయవచ్చునని పోలీసులు వెల్లడించారు.