sonam-kapoor-critisises-donald-trump

డొనాల్డ్ ట్రంప్ ఓ పనికిమాలిని వ్యక్తి: బాలీవుడ్ నటి

ముంబై: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు. ఎనుగుల వేట, జంతువుల వేటకు సంబంధించిన పోటీల నిర్వహణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆమె ఖండించారు. ‘‘ జంతువులను వేటాడడం భారత్‌లో నిషేధం. భారత్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన విషయాల్లో ఇదొక అంశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ పనికిమాలిన వ్యక్తి’’ అని సోనమ్ ట్వీట్ చేశారు. జంతువుల వేటను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇదిలావుండగా ఏనుగులు, జంతువుల వేట పోటీలు నిర్వహణపై ఉన్న వివాదాస్పద నిషేధాన్ని ట్రంప్ ఎత్తవేశారు. ఈ నిర్ణయం తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జంతుప్రేమికులు డొనాల్డ్ ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.