Snow-Storm-in-America

అమెరికాలో భారీ మంచు తుఫాను

వాషింగ్టన్: గల్ఫ్‌ కోస్ట్‌ నుంచి గ్రేట్‌ లేక్‌ వరకు విస్తరించిన భారీ మంచు తుఫాను మధ్య అమెరికాను ముంచెత్తింది. భారీ మంచు, గాలులు, వర్షంతో కూడిన తుఫాను ధాటికి ముగ్గురు మృతి చెందారు. తుఫాను అతలాకుతలం చేస్తుండటంతో అధికారులు స్నో ఎమర్జెన్సీ ప్రకటించారు. అమెరికా దక్షిణ ప్రాంతంలో టోర్నడోలు, ఉరుములతో కూడిన గాలి వానలు ప్రజల్ని భయకంపితుల్ని చేశాయి. మిన్నెసోటా, నెబ్రాస్కా, లోవా, దక్షిణ డకోటా ప్రాంతాల్లో అధికారులు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు.